ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- February 11, 2026
మనామా: పబ్లిక్ ప్రాసిక్యూషన్‌తో సమన్వయంతో లేబర్ ఫండ్ 'టంకీన్'.. ప్రభుత్వ సహాయ నిధులను కాజేసిన కేసులలో విజయం సాధించింది. మొదటి హై క్రిమినల్ కోర్టు వేర్వేరు కేసుల్లో ఇద్దరు వ్యక్తులకు 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలు, BD5,000 మరియు BD50,000 మధ్య జరిమానా విధించింది. ఇతర నేరస్థులకు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డులను తప్పుడుగా చూపించడం, టామ్‌కీన్ వ్యవస్థ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ ద్వారా సరికాని డేటాను సమర్పించడం , అధికారిక పత్రాలను ఫోర్జరీ చేసినందుకు ఆరు నెలల జైలు శిక్ష మరియు BD1,000 - BD2,000 మధ్య జరిమానా విధించింది.
టామ్‌కీన్ మరియు సోషల్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్ నుండి ఫిర్యాదులు అందడంతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. వేతన మద్దతు మరియు పరిహారం చెల్లింపులను పొందడానికి నిందితులు రెండు సంస్థల ఎలక్ట్రానిక్ వ్యవస్థల ద్వారా తప్పుడు సమాచారం, ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించారని తేలింది. తద్వారా మొత్తం BD 88,000 కంటే ఎక్కువ మోసానికి పాల్పడ్డారని విచారణలో అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు









