వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- February 11, 2026
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్‌ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఒకే ఈవెంట్లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి.
కేంద్రం జారీ చేసిన నిబంధనల ప్రకారం.. పద్మ అవార్డుల వంటి పౌర పురస్కారాల వేడుకల్లో కూడా వందేమాతరం ప్లే చేస్తారు. రాష్ట్రపతి హాజరయ్యే అన్ని అధికారిక కార్యక్రమాల్లో ఆయన రాక సమయంలో, అలాగే తిరిగి వెళ్లే సమయంలో ఈ గేయం వినిపిస్తుంది. అయితే సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా సినిమా థియేటర్లలో మాత్రం వందేమాతరం ప్లే చేయాల్సిన అవసరం లేదని.. ఒకవేళ అక్కడ ప్లే చేసినా నిలబడటం తప్పనిసరి కాదని కేంద్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









