ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!

- February 15, 2026 , by Maagulf
ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!

రియాద్: మొత్తం 1,028 ప్రభుత్వ మరియు సెమీ-ప్రభుత్వ సంస్థలు అర్హత కలిగిన సౌదీయేతర ఉద్యోగులను ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ కింద ఆమోదించారు.  3,484 ప్రైవేట్ రంగ సంస్థలకు సైతం ఆమోదం తెలిపారు. వీటిల్లో పనిచేసే ఉద్యోగులు కూడా అదే రెసిడెన్సీ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎక్సెప్షనల్ టాలెంట్ నివాసం కలిగి ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ప్రవాస మరియు ఆధారపడిన రుసుముల నుండి మినహాయింపుతోపాటు వీసా లేకుండానే అపరిమిత ఎగ్జిట్ మరియు ఎంట్రీలు వంటి స్పెషల్ అవకాశాలను పొందవచ్చు.

రీసెర్చ్ ప్రాధాన్యతా స్పెషలైజేషన్‌లో వర్క్ కాంట్రాక్ట్, కనీస నెలవారీ జీతం SR14,000, కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి . మూడు ప్రత్యేక పరిశోధనా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.  శాస్త్రీయ మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రాధాన్యతా రంగంలో వర్క్ కాంట్రాక్ట్ కలిగి ఉండాలి.  నెలకు కనీసం SR35,000 సంపాదించాలి, కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 

ఇక ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ పరంగా చూస్తే.. ఇందులో ప్రభుత్వ లేదా సెమీ-ప్రభుత్వ సంస్థలలో మొదటి మరియు రెండవ-స్థాయి లీడర్ షిప్ స్థానాల్లో ఉండాలి. దరఖాస్తుదారులు నెలకు కనీసం SR80,000 సంపాదించాలి. వారి యజమాని నుండి అధికారిక సిఫార్సు లేఖను అందించాలి.  రెసిడెన్సీ ఐదు సంవత్సరాల పాటు మంజూరు చేయబడుతుంది. అర్హత ప్రమాణాలు నెరవేరినట్లయితే, కనీసం 30 నెలల తర్వాత శాశ్వత నివాసానికి మారవచ్చు. ఇందుకు రుసుము కింద SR4,000 చెల్లించాలని అధికారులు  ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com