తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!

- February 15, 2026 , by Maagulf
తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!

అబుదాబి: ఖతార్ స్టేట్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని శనివారం అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు హెచ్ హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు.  ప్రధానంగా మిడిలీస్టులోని పరిస్థితిని సమీక్షించారు. సమస్యలను ఎదుర్కొవడానికి సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. పలు సమస్యలకు దౌత్య పరమైన చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తద్వారా శాంతిని కొనసాగించడానికి మరియు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి అవకాశాలను పెంచడానికి దోహదపడే అనేక కార్యక్రమాల్లో సంయుక్తంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని ఖతార్ అమీర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com