శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- February 23, 2026
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంజినీరింగ్, విద్యుత్ అధికారులతో కలిసి తెప్పల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించారు.
5 రోజుల ఉత్సవాల షెడ్యూల్:
ఈ ఏడాది తెప్పోత్సవాలు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
- తొలిరోజు (ఫిబ్రవరి 26): శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి జలవిహారం (3 చుట్లు).
- రెండో రోజు (ఫిబ్రవరి 27): రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి వారి విహారం (3 చుట్లు).
- చివరి మూడు రోజులు (ఫిబ్రవరి 28 – మార్చి 2): శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.
- 3వ రోజు: 3 చుట్లు.
- 4వ రోజు: 5 చుట్లు.
- 5వ రోజు (చివరి రోజు): 7 చుట్లు.
రద్దయిన ఆర్జిత సేవలు: తెప్పోత్సవాల కారణంగా భక్తుల రద్దీని దృష్ట్యా టీటీడీ పలు సేవలను రద్దు చేసింది:
ఫిబ్రవరి 26, 27: సహస్రదీపాలంకార సేవ రద్దు.
ఫిబ్రవరి 28, మార్చి 01, 02: ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలు రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









