సినిమాల్లో నటించనున్న దేవీశ్రీ

- July 31, 2016 , by Maagulf
సినిమాల్లో నటించనున్న దేవీశ్రీ

ఇప్పుడు తెలుగులో ఒక యువ తరంగం హీరోగా మెప్పించాలని ఆశపడుతున్నాడు. అతడే దేవి శ్రీ ప్రసాద్. దేవి ప్రస్తుతం తెలుగు లో నెం.1 మ్యూజిక్ డైరెక్టర్. ఇతడు పాటల కంపోజరే కాదు. సింగర్, పాటల రచయిత కూడా. అంతే కాదు స్టేజ్ పెర్ఫార్మర్ కూడా. స్టేజ్ మీద పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తూ యూత్ లో ఒక విధమైన క్రేజ్ సంపాదించాడు. అలాంటి దేవిని తెలుగు తెరమీద హీరోగా ప్రెజెంట్ చేయాలని క్రేజీ డైరెక్టర్ సుకుమార్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాడు. అతి త్వరలో దేవిశ్రీ ప్రసాద్ తెలుగు తెరమీద హీరోగా మెరవడం ఖాయం. సో... ఈ రాక్ స్టార్ మొత్తం మీద కిరాక్ స్టార్ అవ్వబోతున్నాడన్నమాట.కుమారి 21 ఎఫ్.. 'కుమారి 21ఎఫ్' సమయంలో దేవిశ్రీ హీరోగా ఓ సినిమా చేస్తానని సుకుమార్ ఓ ప్రకటన కూడా చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. డీఎస్పీని హీరోగా పరిచయం చేయాలనే ఆలోచన తర్వాత. అయన తండ్రి సత్యమూర్తి మరణించాడు. దీంతో కొన్నాళ్లపాటు ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆతర్వాత సుకుమార్ డైరెక్షన్‌లో 'నాన్నకు ప్రేమతో' సినిమా రిలీజైంది. అనంతరం సుకుమార్ బిజీగా ఉండడంతో దేవీ తెరంగ్రేటం వాయిదా పడిందని ప్రచారం జరిగింది. మ్యూజిక్ కొడితే ట్యూన్ బాగుంటే వింటారు. దానికి సంగీతం ఎవరిచ్చారో కూడా జనానికి అనవసరం. అదే తెరమీద కనిపిస్తే, వాళ్ళ ను ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అందుకే ఒక రంగంలో ఫేమస్ అయినవాళ్లు జనానికి మరింత దగ్గరగా ఉండాలని తెరమీదకు రావాలనుకుంటారు. తెరమీద కనిపించాలని ఎవరికి ఉండదు. ఆ కిక్ అలాంటిది మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com