అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- February 25, 2026
యూఏఈ: అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో యూఏఈలో పెట్రోల్ ధరలు మార్చి 2026లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికా-ఇరాన్ సైనిక వివాదం భయాల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్కు $71 మార్కును దాటింది. ఉద్రిక్తతలు మరింత పెరిగితే, చమురు ధరలు బ్యారెల్కు $100 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కాగా, ఫిబ్రవరి నెలలో యూఏఈ పెట్రోల్ ధరలను లీటరుకు ఎనిమిది నుంచి తొమ్మిది ఫిల్స్ తగ్గించింది. సూపర్ 98, స్పెషల్ 95 మరియు ఇ-ప్లస్ 91 ధరలు వరుసగా లీటరుకు Dh2.45, Dh2.33 మరియు Dh2.26గా ఉన్నాయి.
టెహ్రాన్ కొన్ని గంటల పాటు హార్ముజ్ జలసంధిని మూసివేసిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇటీవల పెరిగాయని, ఇది చమురు సరఫరాపై ప్రభావం చూపిందని Capital.com సీనియర్ మార్కెట్ విశ్లేషకురాలు డేనియేలా హాథోర్న్ అన్నారు. హార్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా అవుతుందని, ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే అది చమురు ధరలపైన ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









