ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!

- February 25, 2026 , by Maagulf
ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!

మస్కట్: కస్టమర్లకు సేవలు అందించడంలో విఫలమైన మస్కట్‌లోని ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు వినియోగదారుల రక్షణ అథారిటీ OMR15,815 జరిమానా విధించింది. అలాగే ఆ సంస్థ ప్రతినిధికి  జైలు శిక్ష విధించింది.  

ట్రావెల్ టిక్కెట్లు జారీ చేయడంలో వైఫల్యం, ముందస్తు నోటీసు లేకుండా ప్రయాణాలను రద్దు చేయడం, అంగీకరించిన పర్యాటక కార్యక్రమాలను అమలు చేయడంలో వైఫల్యం మరియు నిర్ధారించబడిన రిజర్వేషన్‌లను అందించడంలో జాప్యం చేయడంతో వినియోగదారులు అథారిటీని ఆశ్రయించారు.  సరైన సమయంలో ముందుగా అంగీకరించిన పద్ధతిలో సేవలను అందించడంలో విఫలమైనందుకు సంస్థ మరియు దాని ప్రతినిధిని అథారిటీ దోషిగా నిర్ధారించి ఫైన్ తోపాటు జైలుశిక్షను విధించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com