ప్రొ కబడ్డీ టైటిల్‌ను కైవసం చేసుకున్న పట్నా పైరేట్స్
- July 31, 2016
ప్రొ కబడ్డీ లీగ్ - 4 ఫైనల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌పై పట్నా పైరేట్స్ విజయం సాధించింది. దాదాపు ఐదు వారాలుగా అభిమానులను అలరించిన కబడ్డీ టైటిల్‌ను పట్నా పైరేట్స్ కైవసం చేసుకుంది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 37-29తో పట్నా గెలిచింది. ప్రొ కబడ్డీ లీగ్‌ను రెండు సార్లు గెలుచుకున్న తొలి జట్టుగా పట్నా రికార్డు సృష్టించింది.అంతకు ముందు మహిళల ప్రొ కబడ్డీ లీగ్ -1 ఫైనల్ మ్యాచ్‌లో ఫైర్‌బర్డ్స్ పై స్టార్మ్‌క్వీన్స్ ఘనవిజయం సాధించింది. చివరి వరకు ఉత్కఠంగా జరిగిన మ్యాచ్‌లో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది. 22-23తో వెనకబడివున్న సమయంలో స్టార్మ్‌క్వీన్స్ రైడర్ తేజస్విని అద్బుత ఆట తీరును ప్రదర్శించింది. చివర్లో తేజస్విని రెండు పాయింట్లు సాధించి స్టార్మ్క్వీన్స్కు 24-23తో విజయాన్ని అందించింది.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







