తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- February 28, 2026
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రతీరోజూ వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమలలో ప్రతి నెలలో విశేష పర్వదినాలు ఉంటాయి. కొందరు భక్తులు ముఖ్యమైన తేదీల్లో, ప్రత్యేక పర్వదినాల రోజుల్లో స్వామివారి దర్శనానికి వెళ్తారు.ఈ క్రమంలో మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
మార్చి నెలలో విశేష పర్వదినాలు..
- మార్చి 2వ తేదీన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి.
- మార్చి 3న కుమారధార తీర్థం ముక్కోటి. అదేరోజు చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూత.
- మార్చి15న వైష్ణ ఏకాదశి.
- మార్చి 19న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
- మార్చి 27న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.
- మార్చి 28న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
- మార్చి 30వ తేదీన తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభమవుతాయి.
కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు..
- తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి.
- ఇందులో భాగంగా ఆలయంలో మార్చి 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 16న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
- వాహన సేవలు ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి 9.30గంటల వరకు. రాత్రి 7గంటల నుంచి 8.30 గంటల వరకు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు..
- 17వ తేదీ ఉదయం ధ్వజారోహణం (ఉదయం 8 నుంచి 9గంటల వరకు, మేష లగ్నంలో), రాత్రి సమయంలో పెద్దశేష వాహనం.
- 18వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి సమయంలో హంస వాహనం.
- 19వ తేదీ ఉదయంబ సింహ వాహనం, మధ్యాహ్నం ఉగాది ఆస్థానం (మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు), రాత్రి సమయంలో ముత్యపు పందిరి వాహనం.
- 20వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సమయంలో సర్వభూపాల వాహనం.
- 21వ తేదీన ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి సమయంలో గరుడ వాహనం (రాత్రి 7 నుండి 11 గంటల వరకు).
- 22వ తేదీన ఉదయం హనుమంత వాహనం, మధ్యాహ్నం సమయంలో వసంతోత్సవం (మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు), రాత్రి సమయంలో గజ వాహనం.
- 23వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి సమయంలో చంద్రప్రభ వాహనం.
- 24వ తేదీన ఉదయం రథోత్సవం (ఉదయం 8.30 గంటలకు), రాత్రి సమయంలో అశ్వవాహనం.
- 25వ తేదీన ఉదయం చక్రస్నానం (ఉదయం 10 గంటలకు), రాత్రి సమయంలో ధ్వజావరోహణం.
తాజా వార్తలు
- కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 21 మంది మృతి
- ఖతార్ లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు..!!
- ముహర్రక్ లో రోడ్ యాక్సెస్, సేఫ్టీ పై కౌన్సిల్ ఫోకస్..!!
- వాషింగ్టన్లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!
- కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ పైనా ఇరాన్ మిస్సైళ్లు
- ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లలో క్యాష్ లావాదేవీల పై నిషేధం..!!
- రియాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన టెర్మినల్ కెపాసిటీ పెంపు..!!
- మార్చిలో ఇంధన ధరలు పెరుగుతాయా?
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడి
- ‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన









