బిచ్ఛగాడు నిర్మాత మీడియాకి చుక్కలు చూపించాడు
- July 31, 2016
ఒక చిన్న సినిమాగా వచ్చి టాలీవుడ్ లో ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన సినిమా బిచ్ఛగాడు. ఇప్పటి వరకూ ఈ మూవీ 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. తాజాగా ఈ మూవీ వంద రోజుల వేడుకకి రెడీ అవుతుంది. అయితే డబ్బింగ్ సినిమా కావటంతో ఈ మూవీకి నిర్మాత సైతం తక్కువ పబ్లిసిటీని ఇచ్చారు. ఇక మార్కెట్ లో ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే లాభీయింగ్ చేసి మరీ యాడ్స్ తెచ్చుకునే మీడియా సైతం ఈ మూవీని అంతగా పట్టించుకోలేదు.ఒక్కసారిగా ఈ మూవీకి వచ్చిన సక్సెస్ ని చూసిన మీడియా యాడ్స్ కోసం వెంట పడింది. అప్పటికే ఈ మూవీ 50 రోజుల వేడుకని ఘనంగా జరుపుకుంది. మొదట్లోనే మీడియాకి యాడ్స్ ని ఇవ్వని నిర్మాత, 50 రోజుల వేడుక తరువాత అక్షింతలు వేసినట్టుగా కొద్ది ఛానల్స్ కి మాత్రమే యాడ్స్ ని పరిమితం చేశాడు. ఇప్పుడు ఈ మూవీ 100 రోజులు వేడుకకి రెడీ అవుతుంది.200 థియేటర్లలో 75రోజులను ముగించుకొని ఈ ప్రయాణం కొనసాగుతుంది. దీంతో మీడియా బిచ్ఛగాడు 100 రోజుల వేడుకకి భారీ ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. కానీ నిర్మాత మాత్రం మీడియాకి చుక్కలు చూపిస్తున్నారు. బిచ్ఛగాడు కేవలం మౌత్ టాక్ తోనే హిట్ అయిన సినిమా, ఏ ఛానల్ కి యాడ్స్ ని ఇవ్వలేదు.ఇప్పుడు కూడ అనవసరం అంటూ మీడియాని దూరం పెడుతున్నారంట. ఈ విషయాన్ని ప్రముఖ మీడియా రిపోర్ట్స్ బయటకు చెప్పుకోవటం విశేషం. ఏదైమానా బిచ్ఛగాడు నిర్మాత మీడియాకి చుక్కలు చూపించాడని అంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ హీరో తెలుగులో డైరెక్ట్ మూవీకి రెడీ అవ్వటం విశేషం.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







