సెయింట్ పీటర్స్ కేథడ్రిల్ చర్చిను కూల్చి వేశారు..
- July 31, 2016
విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రసిద్ధ ఆర్‌సీఎంకు చెందిన సెయింట్ పీటర్స్ కేథడ్రిల్ చర్చిను ఆదివారం అర్థరాత్రి సమయంలో అధికారులు కూల్చి వేశారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉందంటూ భారీ యంత్రాలు, పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో చర్చి వద్దకు అధికారులు చేరుకున్నారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న చర్చిని కూల్చవద్దంటూ క్రైస్తవులు అధికారులను వేడుకున్నారు.వారికి వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్‌కే అసీఫ్, బొల్ల విజయ్‌కుమార్ తదితరులు వారికి మద్దతుగా నిలిచారు. చర్చిని కూల్చివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గలేదు. భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన కారులను వెనక్కి నెట్టి చర్చిని ధ్వంసం చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ను చూసి క్రైస్తవ సోదరులు ఆయనకు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







