నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- March 02, 2026
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న దాడులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
ఇక ఇరాన్ యూఏఈపై చేసిన దాడులను కూడా ప్రధాని మోదీ ఖండించారు. ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ, యూఏఈకు భారత్ మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో కూడా మాట్లాడి సంఘీభావం తెలిపారు.
తాజా వార్తలు
- జూన్లో భారత్లో పర్యటించనున్న అఫ్గానిస్థాన్..
- యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లో అగ్ని ప్రమాదం–సేవలకు అంతరాయం
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం చర్యలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ









