CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!

- March 07, 2026 , by Maagulf
CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!

యూఏఈ: మిడిలీస్టులో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. అనేక మిడిల్ ఈస్ట్ దేశాలలో 12వ తరగతి విద్యార్థులకు మార్చి 9 నుండి మార్చి 11 వరకు నిర్వంచాల్సిన బోర్డు పరీక్షలను వాయిదా వేస్తూ సర్క్యులర్ జారీ చేసింది.

బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈలలోని విద్యార్థులను ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని CBSE పేర్కొంది.  ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత కొత్త పరీక్షలు నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది. 

మార్చి 10న పరిస్థితిని మళ్ళీ సమీక్షిస్తామని, ఆ తర్వాత మార్చి 12 నుండి జరగాల్సిన పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని CBSE అధికారులు తెలిపారు.

విద్యార్థులు తమ పాఠశాలలతో నిరంతరం టచ్ లో ఉండాలని, మరిన్ని అప్డేట్ ల కోసం CBSE అధికారిక ఛానెల్స్ ను ఫాలో కావాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com