కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!

- March 07, 2026 , by Maagulf
కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!

కువైట్: ఆన్ లైన్ లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడ్డ 13 మందిని కువైట్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు సోషల్ మీడియాలో వేదికగా సమాజానికి హాని కలిగించేలా వార్తలు, ప్రకటనలు మరియు పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని తెలిపారు.  విచారణ అనంతరం 13 మంది నిందితులను ముందస్తు నిర్బంధంలో ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించిందని పేర్కొన్నారు.

నిందితులు మతపరమైన కలహాలు, హింసను ప్రేరేపించడం మరియు జాతీయ ఐక్యతను బలహీనపరిచే మరియు సామాజిక ఐక్యతను దెబ్బతీసే, సమాజంలో విభజనకు కారణమయ్యే విషయాలను వ్యాప్తి చేసినట్లు నిందితులపై ఆరోపణలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

నిందితులు  ప్రజలలో భయాందోళనలను రేకెత్తించే మరియు సాయుధ దళాల రక్షణ సంసిద్ధతను ప్రతికూలంగా ప్రభావితం చేసేలా కంటెంట్‌ ను రూపొందించి వైరల్ చేస్తున్నారని తెలిపింది. జాతీయ భద్రత, ఐక్యత మరియు సమాజానికి ముప్పు కలిగేలా నిందితులు ప్రయత్నించారని విచారణలో అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు.

అటార్నీ జనరల్ సాద్ అల్-సఫ్రాన్ ప్రత్యక్ష పర్యవేక్షణలో దర్యాప్తు జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన ప్రకటనలో తెలిపింది.  ఆయన అనేక ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, వివిధ కోణాల్లో విచారణ చేయించారని వెల్లడించింది.     

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే క్రమంలో బాధ్యతను ఉండాలని, భయాందోళనలను రేకెత్తించే, జాతీయ సంకల్పాన్ని బలహీనపరిచే లేదా సాయుధ దళాల రక్షణ సంసిద్ధతకు హాని కలిగించే పుకార్లు, తప్పుదారి పట్టించే వార్తలు లేదా కంటెంట్‌ను వ్యాప్తి చేయకుండా ఉండాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రజలను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com