ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- March 11, 2026
అమెరికా: ఇరాన్ తో యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. శత్రువులను పూర్తిగా నిర్మూలించే వరకు దాడులు కొనసాగిస్తామని అమెరికా రక్షణ శాఖ అధికారి పీట్ హెగ్సేత్ తెలిపారు. 10 రోజులుగా ఇరాన్ పై దాడులు చేస్తున్నామని, ఈ దాడులతో ఇరాన్ నాయకులకు భయం పట్టుకుందన్నారు. ఇప్పటికే ఇరాన్ లో అన్ని లక్ష్యాలను చేదించామంటున్న అమెరికా.. శత్రువులను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధం ఆగదన్నారు.
మరోవైపు యుద్ధంలో పాల్గొనవద్దని రష్యాను హెచ్చరించింది అమెరికా. అంతేకాదు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. అమెరికా అధ్యక్షుడి మాటలను పాటించాలని, అణ్వాయుధ కార్యక్రమం నుంచి వైదొలగాలని హెగ్సేత్ తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా పలు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇరాన్ కు సహకరించొద్దని, ఈ యుద్ధంలో పాల్గొనవద్దని రష్యాకు కూడా సూచించింది అమెరికా.
తాజా వార్తలు
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!









