బ్రెజిల్‌లో విమానం కూలి ఎనిమిది మంది మృతి
- August 01, 2016
విమానం కూలి ఎనిమిది మంది దుర్మరణం చెందిన ఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. పైపర్ నవాజో జెట్ విమానం పరానా రాష్ట్రంలోని క్యాంబే ప్రాంతంలో ఉన్న ఎక్సలెన్స్ రవాణా శాఖ భవనంపై కూలిపోయింది. దీంతో విమానంలో మంటలు చెలరేగి అందులోని 8 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశానికి కొద్ది దూరంలో ఓ చర్చి కూడా ఉందని, ఆసమయంలో అందులో 300 మంది ప్రార్థనలు చేస్తున్నారని, అదృవశాత్తు వారికి ఏమీ కాలేదని స్థానికులు మీడియాకి తెలిపారు. జెట్‌లోని ప్రయాణికులంతా లోండ్రినా ప్రాంతంలో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తున్నారని, కొద్దిసేపట్లో గమ్యం చేరుకుంటారనగా ఘోరం జరిగిపోయిందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా బ్రెజీలియన్ యూనియన్ ఆఫ్ కోఆపరేటీవ్స్ ఫెనాట్రోకాప్ అధ్యక్షుడు మౌరీ వియానాకి బంధువులని తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్‌వర్క్‌ను భుజపట్టిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ
- మస్కట్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన...
- కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం..
- అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్







