'సామి 2'కు శ్రీకారం చుట్టనున్నట్లు దర్శకుడు హరి
- August 02, 2016
ఇరుముగన్' ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా విక్రం నటించనున్న కొత్త సినిమాను కూడా ప్రకటించారు. గతంలో హరి దర్శకుడిగా విక్రం నటించిన 'సామి' చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగులో బాలకృష్ణ హీరోగా 'లక్ష్మినరసింహ'గా విడుదలై అక్కడా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే 'సామి 2'కు శ్రీకారం చుట్టనున్నట్లు దర్శకుడు హరి ఈ వేదికపై ప్రకటించారు. ఈ సందర్భంగా కథానాయకుడు విక్రం, నిర్మాత శిబు తమీమ్‌ను వేదికపైకి రప్పించి కొత్త సినిమా గురించి ప్రకటించారు. 'సామి' చిత్రంలో విక్రం పవర్ఫుల్ పోలీసు అధికారిగా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య హీరోగా 'సింగం 2'ను రూపొందిస్తున్నారు హరి. ఆ సినిమా పూర్తికాగానే 'సామి 2'ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







