మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- March 24, 2026
మచిలీపట్నం: మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు కీలక చర్యలు తీసుకోబడుతున్నాయి. స్టేషన్లో రెండు లిఫ్ట్‌ల నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి.
రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తై చాలాకాలం గడిచినా, లిఫ్ట్‌ల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇటీవల రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్లాట్‌ఫామ్‌ల మధ్య రాకపోకల్లో ఎదురవుతున్న సమస్యలను వివరంగా తెలియజేస్తూ, లిఫ్ట్‌లు అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయాన్ని సానుకూలంగా స్వీకరించిన రైల్వే అధికారులు, త్వరలోనే ఈ రెండు లిఫ్ట్‌ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎంపీకి తెలియజేశారు.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, మచిలీపట్నం రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫారం నుండి మరొకదానికి వెళ్లే ప్రయాణికుల కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









