షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!

- March 25, 2026 , by Maagulf
షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!

దోహా: ఖతార్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ప్రపంచ ప్రఖ్యాత పాప్ ఐకాన్,  గ్రామీ అవార్డుల విజేత షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా పడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఖతార్ క్యాలెండర్ ప్రకటించింది.దోహాలోని 'స్టేడియం  974  'లో జరగాల్సిన షకీరా  కార్సర్ట్ వాయిదా పడిందని, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

అయితే, టికెట్ల విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని, ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లన్నీ కొత్త తేదీన జరిగే కార్యక్రమానికి చెల్లుబాటు అవుతాయని  స్పష్టం చేశారు. అలాగే, కొత్త తేదీని ప్రకటించిన తర్వాత, తమ టికెట్ల డబ్బును వెనక్కి పొందాలనుకునే వారి దరఖాస్తు సమర్పించడానికి రెండు నెలల గడువు ఇస్తామని ఖతార్ క్యాలెండర్ ప్రకటించింది.  వాస్తవానికి ఈ కాన్సర్ట్ ఏప్రిల్ 1న 'స్టేడియం 974'లో జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన టికెట్ల విక్రయాలు ఫిబ్రవరి 10న ప్రారంభమయ్యాయి. వీటి ధరలు QAR 95 నుండి QAR 650 మధ్య ఉన్నాయి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com