గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత
- April 03, 2026
లోక రక్షణార్థం దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఈ భూమి పై కన్య గర్భాన సాధారణ మనిషిగా జన్మించారు. ప్రజలను అంధకారం నుంచి వెలుగు వైపు, చెడు మార్గం నుంచి సన్మార్గం వైపు నడిపించడమే ఆయన ప్రధాన లక్ష్యం. దైవత్వాన్ని వీడి మానవ రూపంలో వచ్చిన ఆయన, మనుషుల కష్టసుఖాలను స్వయంగా అనుభవించారు. పాపపు ఊబిలో కూరుకుపోయిన వారిని దైవ చింతన వైపు మళ్లించేందుకు, శాంతి మరియు ప్రేమ సందేశాలను బోధిస్తూ అహర్నిశలు శ్రమించారు.
యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ధన వ్యామోహంతో తన గురువుకే ద్రోహం తలపెట్టాడు. కొద్దిపాటి వెండి నాణేలకు ఆశపడి, యేసుక్రీస్తు తనను తాను యూదుల రాజుగా ప్రకటించుకున్నాడనే అబద్ధపు సాక్ష్యాన్ని సృష్టించి రోమా సైనికులకు అప్పగించాడు. ఆయన ఎదుగుదలను ఓర్వలేని కొందరు వ్యక్తులు ద్వేషంతో నిండిపోయి, రోమ్ చక్రవర్తి ముందు తప్పుడు సాక్ష్యాలు చెప్పారు. చివరకు వారందరి ఒత్తిడి మేరకు, ఎటువంటి తప్పు చేయని క్రీస్తుకు శిలువ వేయాలనే కఠిన శిక్షను ఖరారు చేశారు.
శిలువ పై అత్యంత వేదనను అనుభవిస్తున్న సమయంలో కూడా, తనను హింసించిన వారిని క్షమించమని వేడుకున్న గొప్ప మనసు యేసుక్రీస్తుది. ఆయన త్యాగం కేవలం ఒక మతానికి పరిమితం కాకుండా, విశ్వవ్యాప్తంగా ప్రేమ మరియు సహనానికి ప్రతీకగా నిలిచింది. నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన చూపిన బాటలో నడుస్తూ, తోటి వారిపై ప్రేమను పంచుతున్నారు. ఆయన మరణం మానవాళికి ఒక కొత్త నిరీక్షణను, పాప క్షమాపణను ప్రసాదించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు









