నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపురేఖల నమూనా....!!
- July 23, 2015
అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న నూతన రాజధాని నిర్మాణానికి ప్రాజెక్ట్ ను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ ( పి పి పి ) సహకారంతో తయారు చేశామని భీమవరం వాస్తవ్యులు, ఒమన్ లో ప్రముఖ ప్రాజెక్ట్ నిర్వహణా నిపుణులు శ్రీ ఎం.ఎన్.ఆర్ గుప్త గారు భీమవరంలో సిటిజన్స్ ఫోరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చెప్పారు. ఒమాన్ దేశ ఎన్ ఆర్ ఐ అయిన తను 50 మంది అంతర్జాతీయ నిపుణులతో ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రాజెక్ట్ ను తయారు చేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారికి అందజేశామని, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం సుమారుగా 3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని చెప్పారు. ప్రస్తుతం ఒమన్ నుంచి సౌది అరేబియాకు జరుగుతుతన్న హైవే నిర్మాణానికి ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నానని చెప్పారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మ్యాప్ మాత్రమే అందజేశారని తాము మాత్రం ఏ ఏ ప్రాంతాల్లో బిల్డింగులు నిర్మించాలి అనే వాటిపై ప్రాజెక్ట్ ల ద్వారా ప్లాన్ తయారు చేసి సి ఎమ్ కు ఇచ్చామని తెలిపారు. భీమవరానికి చెందిన తను 12 ఏళ్లలో అతి ప్రతిష్టాత్మకమైన 20 అవార్డులు సాధించానని ముఖ్యంగా రైల్వే కాన్ఫరెన్స్ అవార్డు 2014 ను అందుకున్నానని చెప్పారు. రాజధాని ప్రాజెక్ట్ ల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







