సౌదీలో తీవ్రమైన గాలులు, ధూళి తుఫానులు..NCM హెచ్చరిక
- April 16, 2026
రియాద్: రాబోయే రెండు రోజులపాటు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో ధూళి, ఇసుక తూఫానులు చెలరేగే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. ఈ వాతావరణ అంచనా సౌదీ న్యూమెరికల్ వెదర్ మోడల్ (numerical weather model) ఫలితాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కాలంలో ధూళి/ఇసుక మరియు అలల కదలిక, తీవ్రత ఎలా ఉంటాయో వివరిస్తూ NCM ఒక యానిమేటెడ్ మ్యాప్‌ను కూడా విడుదల చేసింది.
ఈ అంచనా ప్రకారం తబూక్, మదీనా, మక్కా మరియు జాజాన్ ప్రాంతాల అంతటా పగటిపూట, ధూళి మరియు ఇసుక తుఫానులు ప్రభావం ఉంటుందని, తీరప్రాంతాల్లో అయితే దీనికి తోడుగా సముద్రంలో అలలు కూడా ఉధృతంగా ఉంటాయని అంచనా వేసింది.
శనివారం నాటికి ఈ తీవ్రమైన గాలుల ప్రభావం అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులు (Northern Borders) మరియు హాయిల్ ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందని తెలిపింది.
అయితే, ఖాసిమ్, రియాద్, తూర్పు ప్రావిన్స్ మరియు నజ్రాన్ ప్రాంతాల్లోని కేవలం కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలోనే ఈ వాతావరణ ప్రభావం ఉంటుందని NCM తన ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







