తామరగింజల్తో నిత్య యవ్వనం

- July 23, 2015 , by Maagulf
తామరగింజల్తో నిత్య యవ్వనం

తామరపువ్వును దేవతా పుష్పంగా మన దేశంలో ప్రజలు బాగా ఆదరిస్తారు. అయితే ఈ తామరపువ్వునే కాదు తామరపువ్వులోని గింజల్లో అనేక రకాల పోషకాలు, ప్రోటీన్లు చాలా అధికం. ఈ గింజలనే మార్కెట్లో ఫూల్‌ మఖానీగా విక్రయిస్తున్నారు. దీనికి తేలిగ్గా జీర్ణమయ్యే లక్షణం ఉండడం వల్ల ఏ వయసువారైనా తినొచ్చు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహం, హృద్రోగాలు, కాన్సర్‌ వంటి వాటికి దారి తీసే ప్రీ రాడికల్స్‌ను నిరోధిస్తాయి. దీనిలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వయసుని మీద పడనీయవు. ముఖ్యంగా ఇందులో ఎల్‌ ఐసొయాస్పర్టిల్‌ మిథైల్‌ ట్రాన్స్‌ఫెరేజ్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది దెబ్బ తిన్న ప్రొటీన్లను బాగు చేస్తుంది. అందుకే ఈ గింజలను ముఖ్యంగా ఏంటీ ఏజింగ్‌ క్రీముల్లోనూ, మందుల్లోనూ వాడుతున్నారు. అంతే కాదు గర్భిణులు, బాలింతలకూ ఇవి ఆహారంతో పాటు కలిపి ఇవ్వడం వల్ల నీరసం లేకుండా ఉంటుంది. నిద్రలేమి, చికాకులతో బాధపడేవాళ్లు వీటిని తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని పీచు పదార్ధం మలబద్దకం ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com