మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- April 20, 2026
మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. వెయ్యి ఇళ్లు దగ్ధం
కౌలాలంపూర్: మలేషియాలోని సబా రాష్ట్రంలో ఊహించని రీతిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సందకన్ జిల్లాలోని కాంపంగ్ బహగియా ప్రాంతంలో మంటలు చెలరేగి బీభత్సం సృష్టించాయి. ఈ ప్రమాదంలో సుమారు వెయ్యి ఇళ్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. ఆస్తినష్టం భారీగా జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
సముద్రం పై కర్రలతో నిర్మించిన ఇళ్లు కావడంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి. ఈ ఇళ్లలో నివసిస్తున్న దాదాపు 9 వేల మంది ప్రజలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బాధితులందరూ ఆశ్రయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తోంది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









