బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!

- April 20, 2026 , by Maagulf
బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!

బహ్లా: బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ను హెరిటేజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి సయ్యద్ ఇబ్రహీం బిన్ సయీద్ అల్ బుసైదీ ప్రారంభించారు. ఇవి ఒమన్ సాంస్కృతిక విశేషాలతోపాటు ఒక సమగ్ర వారసత్వ విషయాలను తెలిపే గమ్యస్థానంగా నిలుస్తాయని పేర్కొన్నారు.  ఈ మ్యూజియంలు సందర్శకులకు మెరుగైన అనుభవాన్ని ఇస్తాయని అన్నారు. 

'బైత్ అల్ హదీత్'లో ఉన్న పురావస్తు సేకరణల మ్యూజియం.. బహ్లా కోట మరియు బహ్లా ఒయాసిస్‌లో పునరుద్ధరణ పనుల సమయంలో కనుగొనబడిన కళాఖండాలను ప్రదర్శనకు పెట్టారు. వీటిలోని చాలా వస్తువులు క్రీస్తుపూర్వం మూడవ సహస్రాబ్ది నాటివి. వారసత్వ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ అందించిన పురావస్తు సేకరణలతో ఈ మ్యూజియం ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో అభివృద్ధి చేశారు.

'బైత్ అల్ జబల్'లో ఉన్న ఉల్కల మ్యూజియం ఒమన్‌లో కనుగొనబడిన మూడు రకాల ఉల్కలను ప్రదర్శిస్తుంది. వాటి మూలం, కూర్పును తెలియజేసే శాస్త్రీయ వివరణలు కూడా ఇక్కడ చూడవచ్చు.

'బుర్జ్ అల్ జిహాద్రి'లో ఉన్న ఒమానీ తేనె మ్యూజియం సాంప్రదాయ తేనెటీగల పెంపకం పద్ధతులు మరియు తేనె ఉత్పత్తి విధానాలను తెలియజేస్తుంది. కోట నిర్వహణ సంస్థ సహకారంతో బహ్లాకు చెందిన ఒక స్థానిక పెట్టుబడిదారుడు దీనిని నిర్వహిస్తున్నారు.

'అల్ ఖసాబా'లోని డోర్స్ మ్యూజియంలో ఒమన్‌లోని ఎనిమిది పురాతన చెక్క తలుపులు ఉన్నాయి. వాటిలో ఒకటి 750 సంవత్సరాల కంటే పాతదని అంచనా. కొన్ని తలుపులపై అసలైన చేతివృత్తుల వారి పనితీరుతోపాటు ఇస్లాం పూర్వ నాగరికతలకు సంబంధించిన చెక్కడాలు మరియు నబహినా కాలం నాటి ఒక ఇస్లామిక్ శాసనం దాని అసలు రూపంలో భద్రపరచారు. 

వీటితోపాటు సాంప్రదాయ ఆయుధాలు మరియు తాళపత్ర గ్రంథాలు సహా అదనపు మ్యూజియంలు, ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు మరియు ఇంటరాక్టివ్ సాంస్కృతిక ప్రదేశాల వంటి సహాయక సౌకర్యాలతో కూడినవి ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని అల్ మరాసిమ్ టూరిజం అండ్ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్-జనరల్ ఇంజనీర్ అలీ బిన్ అహ్మద్ అల్ షాక్సీ వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com