రోడ్లపై అమర్చిన బాంబులు : 10మంది మృతి

- August 06, 2016 , by Maagulf
రోడ్లపై అమర్చిన బాంబులు : 10మంది మృతి

అఫ్ఘానిస్థాన్‌లోని తూర్పు ప్రాంతమైన పక్టియాలో ఉగ్రవాదులు రెండుచోట్ల రోడ్లపై అమర్చిన బాంబులు పేలడంతో మొత్తం 10మంది మరణించారు. ఓ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, మరోచోట అదే తరహాలో ఓ ట్రాక్టర్‌ పేలిపోయి ఐదుగురు చనిపోయారు. ఆ ప్రాంతంలో ప్రాబల్యం ఉన్న తాలిబన్లే బాంబులు అమర్చి ఉంటారని పక్టియా గవర్నర్‌ అధికార ప్రతినిధి అటల్‌ తెలిపారు. తాలిబన్ల చెరలో పాక్‌ హెలికాప్టర్‌ సిబ్బంది మరోవైపు పాకిస్థాన్‌కు చెందిన ఓ హెలికాప్టర్‌లోని ఏడుగురు సిబ్బందిని తాలిబన్లు బందించారు. అఫ్ఘానిస్థాన్‌లోని లోగర్‌ రాష్ట్రంలోని అజ్రా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడుగురితో కూడిన ఎంఐ-17 హెలికాప్టర్‌ అఫ్ఘాన్‌ సరిహద్దుల్లో ప్రయాణిస్తుండగా, ప్రతికూల పరిస్థితుల్లో తాలిబన్ల అధీనంలో ఉన్న చోట కూలిపోయింది. ఈ ఘటన నుంచి అందులోని ఏడుగురు సురక్షితంగా బయటపడగా, వారిని తాలిబన్లు బందీ చేశారు. ఉగ్రసంస్థలపై పాక్‌ చర్యలు తీసుకోవాలి పాకిస్థాన్‌కు ఇప్పటికే 30 కోట్ల డాలర్ల రక్షణ సహాయాన్ని నిలిపివేసిన అమెరికా.. మరో అడుగు ముందుకేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన ఉగ్రసంస్థలపైనే కాకుండా.. అన్నింటిపైనా చర్య తీసుకోవాలని పాకిస్థాన్‌కు సూచించింది. తమకు ముప్పుగా మారిన గిరిజన ప్రాంతాల్లోని ఉగ్ర సంస్థలు కొన్నింటిని పాకిస్థాన్‌ అదుపు చేసిందని, ఇదే విధంగా మిగతాచోట్ల కూడా మొత్తం ఉగ్రవాదాన్ని, ఆయా సంస్థలను అదుపు చేయాల్సి ఉందని ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడిన అమెరికా విదేశాంగ ప్రతినిధి టోనర్‌ అన్నారు. పాకిస్థాన్‌ సైన్యం కొన్ని ఎంపిక చేసిన ఉగ్ర సంస్థలనే టార్గెట్‌ చేసి చర్య తీసుకుంటోందన్న ఆయన, ఈ వైఖరి విడనాడాలని స్పష్టం చేశారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com