క్రిష్ - రమ్యల కు శుభాకాంక్షలు
- August 07, 2016
దేవతలే బంధువుల్లా ఆశీర్వదించడానికి వస్తారు అంటూ పెళ్ళి పిలుపు ఇచ్చిన క్రిష్ రమ్యల పెళ్ళి నిన్న భాగ్య నగరంలోని గోల్కొండ రిసార్ట్ లో అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. 'గమ్యం' నుంచి 'కంచె' వరకూ ఎన్నో విలక్షణ సినిమాలు తీసిన క్రిష్ పెళ్ళికి టాలీవుడ్ సెలెబ్రెటీలు అంతా తరలి వచ్చారు. నిన్న ఆదివారం రాత్రి తొమ్మిది గంటల అయిదు నిమిషాలకు జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.మేళతాళాల మధ్య ఈ అందమైన జంట జీలకర్రా బెల్లం తంతుతో ఒకటి అయ్యారు. చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ - అల్లుఅర్జున్ - నాగ చైతన్య - హీరో రామ్ - గోపీచంద్ - దాసరి నారాయణరావు మరియు రాజమౌళిలతో పాటు టాప్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ రాశి ఖన్నా మంచు లక్ష్మి ప్రసన్నా ప్రగ్యాజైస్వాల్ లతో పాటు ఎందరో బ్యూటీలు ఈ వివాహ వేడుకలో సందడి చేసారు.తమిళ హిందీ సినిమా పరిశ్రమకు సంబంధించిన సెలెబ్రెటీలు మాత్రమే కాకుండా అనేక మంది ప్రముఖ రాజకీయ వేత్తలు ఈ వివాహానికి రావడం విశేషం. అయితే ఈ పెళ్ళిలో అందరి దృష్టీ బాలయ్య గెటప్ మీదే పడింది. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' కోసం బాలయ్య ఏర్పరుచుకున్న ఈ లుక్ విశేషాల గురించి క్రిష్ బాలయ్యల కాంబినేషన్ లో రాబోతున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాల గురించి అనేక మంది బాలయ్యతో మాట్లాడుతూ అ సినిమా విశేషాల గురించి తెలుసుకున్నట్లు టాక్.ఈ పెళ్ళి వేడుకలు అయిన తరువాత క్రిష్ తన భార్యతో వెళ్లబోయే హనీమూన్ ఏర్పాట్లు బాలయ్య స్వయంగా చేసాడు అంటే ప్రస్తుతం బాలకృష్ణ క్రిష్ ల మధ్య ఎంత సాన్నిహిత్యం కొనసాగుతోందో అర్ధం అవుతోంది. ఈ నెలాఖరుకు తన హనీమూన్ నుంచి తరిగి వచ్చిన తరువాత దర్శకుడు క్రిష్ తిరిగి తన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా పై దృష్టి పెడతాడు అని టాక్.ఇది ఇలా ఉండగా వచ్చే సంవత్సరం ప్రారంభం నుండి క్రిష్ దర్శకత్వంలో ఒక ప్రముఖ ఛానల్ కోసం క్రిష్ పవన్ కళ్యాణ్ లు ఒక షో చేయబోతున్న నేపధ్యంలో ఈ వివాహ వేడుకకకు పవన్ వస్తాడని అందరూ ఎదురు చూసారు. అయితే ఇక్కడ పవన్ తన పద్ధతిని కొనసాగిస్తూ క్రిష్ పెళ్ళి విషయంలో కూడ తన మౌనాన్ని కొనసాగించడం ఒక విధంగా పవన్ విచిత్ర స్వభావాన్ని సూచిస్తోంది.సామాజిక స్ప్రహతో విభిన్న సినిమాలు తీయడంలో పేరు గాంచిన క్రిష్ ఈ పెళ్ళి ఇచ్చిన నూతన ఉత్సాహంతో బాలయ్య అభిమానులు కోరుకునే విధంగా 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని రూపొందిస్తాడని భావిద్దాం. క్రిష్ - రమ్యల వైవాహిక జీవితం ఆనందమయంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియ చేస్తూ ఎపి హెరాల్డ్ ఆకాంక్షిస్తోంది..
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









