త్వరలో ముంబైలో 1200 వైఫై హాట్స్పాట్లు
- August 08, 2016
ముంబయి నగరానికి 2017 మే లోగా 1,200ల వైఫై హాట్‌స్పాట్‌లు రానున్నాయి. ముంబయిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ తెలిపారు. అసెంబ్లీ పమావేశాల్లో పట్టణాభిహవృద్ధి విషయమై మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ముంబయి నగరాన్ని స్మార్ట్‌గా మలచడానికి గతంలో సీసీటీవీ ప్రాజెక్టును ప్రవేశ పెట్టగా, ఇప్పుడు ఇది రెండో కార్యక్రమంగా ఆయన పేర్కొన్నారు.
2017 మే లోగా మంబయిలోని పలు ప్రాంతాల్లో ఈ హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మొత్తం 1200ల వైఫై హాట్‌స్పాట్లలో మొదటి విడతగా 2016 నవంబర్‌కల్లా 500 హాట్‌స్పాట్లు పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. ఇతర విషయాలపై మాట్లాడుతూ.. మురికి నీరు సముద్రంలో కలవకుండా మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది తగిన చర్యలు చేపడుతున్నట్లు, చెత్తను విద్యుత్ తయారీకి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సబ్‌అర్బన్ ప్రాంతాలను కూడా మరింత మెరుగైన, నివాసయోగ్యమైన ప్రాంతాలుగా మలచాలనుకుంటున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







