ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!

- June 03, 2026 , by Maagulf
ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!

కువైట్: మిస్సైల్, డ్రోన్ దాడుల నేపథ్యంలో ప్రజలకు కువైట్ సైన్యం కీలక సూచనలు చేసింది. వివిధ ప్రాంతాల్లో వినిపించే పేలుడు శబ్దాల పట్ల ప్రజలు ఆందోళన చెందవద్దని, సంబంధిత అధికారులు జారీ చేసిన సూచనలను పాటించాలని కోరింది. ఈమేరకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-అత్వాన్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు.  

కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకున్న నేపథ్యంలో కింద పడిన ఏవైనా శిథిలాలు, శకలాలు లేదా గుర్తించలేని వస్తువులకు దూరంగా ఉండాలని, వాటిని  తాకే ప్రయత్నం చేయవద్దని పౌరులను మరియు నివాసితులను హెచ్చరించారు. అటువంటివి భద్రతకు ప్రమాదం కలిగించగలవని, అలాంటి వాటిని గుర్తిస్తే వెంటనే అత్యవసర హాట్‌లైన్  నెంబర్ 112కు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా సంస్థలకు సహకరించాలని, భద్రతా ఆదేశాలను పాటించాలని కువైట్ సైన్యం పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com