ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!

- June 03, 2026 , by Maagulf
ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. బర్కా విలాయత్‌లో అత్యధికంగా 49.4°C ఉష్ణోగ్రత నమోదు అయినట్లు పేర్కొంది. అనేక ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉందన్నారు. 

బర్కా తర్వాత అల్ సువాయిక్‌లో 49.2°C ఉష్ణోగ్రత నమోదు కాగా, అల్ ఖబోరా మరియు ఖురయ్యత్‌లలో 49.0°C నమోదైంది. వాడి అల్ మావిల్ (48.8°C), బిద్బిద్ (48.7°C), మరియు మహౌత్, సుర్ రెండింటిలోనూ 48.4°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్ కామిల్ వాల్ వాఫీలో 48.1°C నమోదు కాగా, బౌషర్ మరియు కేపిటల్ నగరం మస్కట్ రెండింటిలోనూ గరిష్టంగా 47.9°C ఉష్ణోగ్రత నమోదైంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com