ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్‌ రీకాల్..!!

- June 04, 2026 , by Maagulf
ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్‌ రీకాల్..!!

దోహా: సౌదీ అరేబియాలో తయారైన గోడివా కునాఫా & పిస్తా మిల్క్ చాక్లెట్ బార్‌ను కువైట్ హెల్త్ మినిస్ట్రీ రీకాల్ చేసింది. దాని లేబుల్‌పై ప్రకటించని ఒక పదార్ధంగా గుడ్లు ఉన్నందున, రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది గుడ్డు అలెర్జీ ఉన్నవారిలో, ముఖ్యంగా పిల్లలలో అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చని పేర్కొంది. మరోవైపు, గోడివా కునాఫా & పిస్తా మిల్క్ చాక్లెట్ బార్ ను దుకాణాల నుండి రీకాల్ చేసినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) ప్రకటించింది.
ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలోని ఆహార భద్రతా విభాగం, ప్రభావిత ఉత్పత్తులను స్థానిక మార్కెట్ నుండి తక్షణమే ఉపసంహరించుకోవాలని ఖతార్‌లోని సరఫరాదారులను ఆదేశించింది.  వినియోగదారుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం మరియు ఆహార భద్రతను ప్రోత్సహించడం కోసం తీసుకుంటున్న ప్రయత్నంలో ఈ చర్య ఒక భాగమని స్పష్టం చేసింది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com