ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- June 04, 2026
జెడ్డా: సౌదీ పోర్ట్స్ అథారిటీ (Mawani), ఎమిరేట్స్ షిప్పింగ్ లైన్ కొత్త “SRS” షిప్పింగ్ సర్వీసును జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌కు జోడించింది. ఇది ఆ పోర్టును ఇండియా మరియు జిబూటీలతో కలుపుతూ, ప్రపంచ మార్కెట్లతో సౌదీకి ఉన్న కనెక్టివిటీని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. అలాగే సప్లై చైన్ సామర్థ్యం మెరుగుతపడుతుందని, ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలలో ఒకటైన రెడ్ సీ మీదుగా వాణిజ్య రాకపోకలకు మద్దతు లభిస్తుందని అథారిటీ తెలిపింది.
ఇక జెడ్డాను ఇండియాలోని ముంద్రా పోర్ట్ మరియు జిబూటీ పోర్ట్‌తో అనుసంధానించే ఈ కొత్త షిప్పింగ్ సర్వీస్, 2,144 TEUల వరకు సరుకును మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచ పనితీరు సూచికలలో సౌదీ అరేబియా ర్యాంకింగ్‌ను మెరుగుపరచడానికి మరియు జాతీయ ఎగుమతులకు మద్దతు ఇవ్వడానికి సౌదీ పోర్ట్స్ అథారిటీ చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగమని ప్రకటించారు. మూడు ఖండాలను కలిపే వారధిగా సౌదీని నిలబెట్టి, దానిని ఒక ప్రపంచ లాజిస్టిక్స్ కేంద్రంగా మార్చాలనే జాతీయ రవాణా మరియు లాజిస్టిక్స్ వ్యూహం లక్ష్యాలకు కూడా ఇది మద్దతుగా నిలుస్తుందని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









