షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- June 04, 2026
యూఏఈ:షార్జాలో ఓ భారతీయ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన హత్యకు సోషల్ మీడియా వీడియోకు సంబంధించిన వివాదమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని షార్జా పోలీసులు తెలిపారు. మృతి చెందిన భారతీయ వ్యక్తిని దుబాయ్‌లోని ఒక జ్యూస్ షాపులో పనిచేస్తున్న 40 ఏళ్ల ప్రవాసిగా గుర్తించారు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో తమ సంస్థ ఉందని 'YAB Legal' సీఈఓ సలాం పాపినస్సెరీ తెలిపారు. ఈ ఘటన మే 31న జరిగింది.
భారతీయ మీడియా కథనాల ప్రకారం..మృతుడు నిర్వహిస్తున్న ఒక 'TikTok Live' సెషన్ సమయంలో అనుమానితుడితో అతనికి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ వీడియోలో వారిద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం కనిపించింది. అంతేకాకుండా, షార్జాలో తనను నేరుగా కలవాలని అనుమానితుడు బాధితుడికి సవాలు విసిరాడు. వీరిద్దరి మధ్య ఆన్లైన్లో చాలా కాలంగా విభేదాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
మృతుడు గత ఐదేళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నాడని, గత ఏడాది సెలవుల నిమిత్తం కేరళలోని తన స్వగ్రామానికి వెళ్లి వచ్చాడని సలాం తెలిపారు. అతని సోదరుడు మరియు మరికొందరు బంధువులు కూడా ప్రస్తుతంయూఏఈలోనే ఉన్నారని పేర్కొన్నారు. మృతుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన పత్రాల ప్రక్రియను పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









