షార్జా లేబర్ అకామడేషన్లో అగ్నిప్రమాదం
- August 09, 2016
షార్జాలోని అల్ సజా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న వర్కర్స్ అకామడేషన్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే, అక్కడినుంచి కార్మికుల్ని ఖాళీ చేయించేశారు. దాంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సమి అల్ నక్బి ఈ ప్రమాదం గురించి చెబుతూ, మధ్యాహ్నం 1.32 సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపులోకి తెచ్చామని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదనీ, అక్కడే వున్న గ్యాస్ సిలెండర్లను తక్షణం తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యిందని ఆయన వివరించారు. ప్రమాద కారణాల్ని విశ్లేషించేందుకుగాను షార్జా పోలీసులకు ప్రమాద స్థలిని అప్పగించినట్లు చెప్పారు సమి అల్ నక్బి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









