1600మంది సిబ్బందితో బందోబస్తు 1600మంది సిబ్బందితో బందోబస్తు..
- August 09, 2016ఈనెల 12వ తేదీ శుక్రవారం నుంచి జిల్లాలో ప్రారంభమవుతున్న కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రధాన రహదారులపై భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ట్రాఫిక్ అధికారులు చర్యలు చేపట్టారు. 1600మంది సిబ్బందిని బందోబస్తులో వినియోగిస్తున్నారు. వీరికి జడ్చర్ల పోలీస్ శిక్షణ కేంద్రం(డీటీసీ)లో మంగళవారం విధులు కేటాయించారు. ఇతర ప్రాంతాల్లోని పోలీసులకు కూడా విధులు కేటాయించడంతో వారు డీటీసీ కేంద్రానికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఇక్కడి నుంచి తమకు కేటాయించిన ప్రాంతానికి 11వ తేదీన గ్రూపులుగా వెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా 44వ నంబర్ జాతీయ రహదారిపై తిమ్మాపూర్ నుంచి అలంపూర్ చౌరస్తా వరకు ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి శ్రీశైలం దారిలో, భూత్పూర్ నుంచి రాయిచూర్ సరిహద్దు వరకు బందోబస్తు నిర్వహించనున్నారు. ఇందుకుగాను 100బైక్‌లు, 25జీపులతో నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు. ట్రాఫిక్ పర్యవేక్షణకు షాద్‌నగర్ ఏఎస్పీ కల్మేశ్వర్ సింగెనవార్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు. 1500మంది సిబ్బందితో పాటు 10మంది డీఎస్పీలు, 42మంది సీఐలు, 125మంది ఎస్‌ఐలు ట్రాఫిక్ విధుల్లో పాల్గొంటారని చెప్పారు.ఏర్పాట్లు పూర్తిట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను పూర్తిచేశారు. పెట్రోలింగ్ కోసం బైక్‌లను సిద్దం చేస్తున్నారు. ఆయా వాహనాలకు పోలీస్ హారన్, మైకులు బిగించారు. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ నియంత్రణ కోసం స్టాపర్ బోర్డులను కూడా సిద్ధం చేశారు.
తాజా వార్తలు
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!







