CMYF మస్కట్ టీం హెడ్ చందక రాందాస్‌కు ప్రత్యేక గుర్తింపు

- June 11, 2026 , by Maagulf
CMYF మస్కట్ టీం హెడ్ చందక రాందాస్‌కు ప్రత్యేక గుర్తింపు

మస్కట్: ఒమాన్‌లో భారత రాయబారిగా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసి వీడ్కోలు తీసుకుంటున్న సందర్భంగా మాజీ భారత రాయబారి జి.వి.శ్రీనివాస్, సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన CMYF మస్కట్ హెడ్ చందక రాందాస్ ని ప్రత్యేకంగా సన్మానించారు.

మస్కట్‌లో ఉన్న కాలమంతా సామాజిక సేవను ఒక ఉద్యమంలా కొనసాగిస్తూ, తెలుగు కమ్యూనిటీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన రాందాస్, ఆపదలో ఉన్న వారికి “నేనున్నా” అనే భరోసా కల్పిస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారు. తెలుగు ప్రజలకు అండగా నిలుస్తూ ఆయన సేవలను గుర్తించిన శ్రీనివాస్ ప్రత్యేక ధృవీకరణ పత్రాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ సన్మానం కేవలం చందక రాందాస్ కే కాకుండా, మొత్తం తెలుగు కమ్యూనిటీకి దక్కిన గౌరవంగా పలువురు అభిప్రాయపడ్డారు.ముఖ్యంగా ఆయన ఆదర్శ వ్యక్తిత్వం, సేవా తపన, మానవతా దృక్పథానికి లభించిన అరుదైన గుర్తింపుగా కమ్యూనిటీ సభ్యులు కొనియాడుతున్నారు.

తెలుగు సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న రాందాస్ కి లభించిన ఈ గౌరవం, భవిష్యత్తులో మరింత మంది సేవా కార్యక్రమాల వైపు అడుగులు వేయడానికి స్ఫూర్తినిస్తుందని పలువురు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com