షార్జ లో పని మనిషి ఘాతుకం అబార్షన్ ద్వారా 6 నెలల పిండాన్ని హతం
- August 10, 2016
షార్జ: ఆసియా ప్రాంతం లోని ఇండోనేషియా దేశానికి చెందిన ఓ పని మనిషి తన ఆరు నెలల పిండంని అబార్షన్ ద్వారా హతం చేసి అల్ బుహారహ్ ప్రాంతంలో ఒక తోట లో ఖననం చేసింది. ఈ శిశు హత్యకు మంగళవారం షార్జ క్రిమినల్ కోర్ట్ 2,000 డి హెచ్ జరిమానా తన బిడ్డని దారుణంగా చంపినందుకు జైలుశిక్ష సైతం విధించారు.ఆమె శిక్ష కాలం పూర్తి చేసిన తర్వాత దేశమునుండి పంపించి వేయాలని కోర్టు ఆదేశించింది.న్యాయవాదులు 'రికార్డు ప్రకారం ఈ ఇండోనేషియన్ పనిమనిషి ఒక పాకిస్తానీ వ్యక్తితో అక్రమ సంబంధం కల్గి ఉన్నట్లు పేర్కొంది. ఆమె అక్రమ శిశువుని చంపడంలో ఆ మహిళా ఆవేశం ప్రదర్శించిందని ఆరోపించింది..శిశువుని హతమార్చిన సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 25 న జరిగింది. అల్ నూర్ మసీదు వద్ద తాటి చెట్ల మధ్య ఖననం చేసింది తోట శుభ్రం చేసేందుకు వచ్చిన ఒక పురపాలక కార్మికుడు పసిగుడ్డు మృతదేహాన్ని కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీనితో విచారణ చేసిన వారికి ఈ పనిమనిషి వ్యవహారం వెలుగులోనికి వచ్చింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







