ఆగస్ట్ 15న విక్రమ్ ఇంకొక్కడు ఆడియో
- August 11, 2016
శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న మరో ఎక్స్ పెరిమెంటల్ యాక్షన్ థ్రిల్లర్ `ఇంకొక్కడు`. నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం `ఇరుముగన్`. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ పై ఆ సంస్థ అధినేత నీలం కృష్ణారెడ్డి `ఇంకొక్కడు` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఆగస్ట్ 15న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.
నీలం కృష్ణారెడ్డి మాట్లాడుతూ ``చియాన్ విక్రమ్ హీరోగా, గ్లామర్ క్వీన్స్ నయనతార, నిత్యామీనన్‌లు నటించిన చిత్రం ఇంకొక్కడు. శిబుథమీన్స్ గారు, ఆనంద్ శంకర్ గారు కాంబినేషన్ లో భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం రూపొందుతోంది. స్టార్ నటీనటులతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జైరాజ్, సినిమాటోగ్రాఫర్ గా ఆర్.రాజశేఖర్, ఎడిటర్ గా భువన్ శ్రీనివాస్ వంటి టాప్ టెక్నిషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఇటీవల తమిళంలో విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రతి సినిమాలో ఏదో ఒక విలక్షణతను చూపే చియాన్ విక్రమ్ గారు ఈ చిత్రంలో హీరోగానే కాకుండా, హిజ్రా గెటప్‌లో కూడా అలరిస్తున్నారు. సినిమా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మేకింగ్ వాల్యూస్‌కు, విక్రమ్ స్టయిల్, గెటప్స్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌కు దాదాపు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ భారీ బడ్జెట్ చిత్ర ఆడియో వేడుకను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీల సమక్షంలో జె.ఆర్.సి. కన్వెక్షన్ సెంటర్లో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నాం`` అన్నారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









