వేదన
- July 26, 2015
నేను మాత్రం పట్టణపు వీధి దీపాల వెలుగుల్లో
పట్టె మంచెపు పానుపులో జోగుతూ
ఆమె అందాలను వర్ణిస్తూనే ఉంటాను ,అప్పుడే
ఎక్కడో కరడు గట్టిన ఓ కామందునికి బలియై
వరకట్న పిశాచ దాహాగ్నికి ఆహుతై ,ఓ శరీరం
కాలుతూనే ఉంటుంది,రాక్షసత్వం నిండిన మానవ
నీచత్వoలో...
వేల వేల వెండి తెరల వేదికలపై ఎందరెందరో
చిత్రగత్తెల నాట్య భంగిమలను ఆశ్వాదించి
ఆనందించిన వాడే,
తను మాత్రం ప్రపంచపు వెలుపల నిలుచొని
తనను తాను సంస్కారిగా భావించి,ఆమెను మాత్రం
ప్రచార,అపచార సాదనంగా మారుస్తూనే ..
ఆడది ఆదిశక్తి,ప్రేమ స్వరూపిణి,అమ్మ అని
వర్ణణాతింగా వల్లె వేసిన వాడే, ఆమే మాత్రం
తనకు ఆడబిడ్డను ప్రసవించిందని...
ఆ అమ్మ మనసును తన మూర్క్ఖత్వపు మాటల
తూటాలతో వేదన పెడుతాడెoదుకో.... ?
అడ పిల్ల నమ్మా అని ఓ మధు ప్రియ
ఏడ్చి గొంతెత్తి పాడినా ,
అత్తింటి వారికి ఎలా ముఖం
చూపించాలని, హాస్పిటల్ బెడ్డుఫై
ముఖం చాటేసుకొని కుమిలి కుమిలి ఏడ్చే
బాలింతని జూసి ఒక ఆడ స్టెత స్కోపు
విల విల్లాడినా
నన్ను చంపకమ్మా నిన్ను,నాన్నను చక్లెట్టో బిస్కాట్టో
అడుగను అని ఓ పసిహృదయం ఘోషించిన,మారని
ఈ దేశ దుస్థికి మేము మాత్రం దుఖ్ఖిoచడం తప్ప
ఏం చేయగలమమ్మ కడుపులోనే కరిగి పోతున్న ...
ఓ చిన్నారి తల్లి..
(07-07-2013 "కవి సంగమం" గ్రూపులో .. భ్రూణ హత్యలు లేని నవ భారతాన్ని ఆశిస్తూ.. )
--జయ రెడ్డి బోడ(అబుధాబి)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









