దుబాయ్ ఎమిరేట్స్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం 7000 డాలర్లు

- August 12, 2016 , by Maagulf
దుబాయ్ ఎమిరేట్స్ ప్రమాద బాధితులకు నష్టపరిహారం 7000 డాలర్లు

ఎమిరేట్స్ ఫ్లైట్ ఇ కె  521 దుబాయ్  (డి ఎక్స్ బి  ) క్రాష్ ల్యాండ్ లో గాయపడిన ప్రయాణీకులకు $7000 నష్ట పరిహారం ఇస్తున్నట్లుగా  ప్రకటించినట్లుగా  సమాచారం అందింది. ఎమిరేట్స్ బోర్డు  క్రాష్ ల్యాండ్ అయిన విమానంలోని  282 ప్రయాణీకులకు ఒకొక్కరికి 7,000 డాలర్లను నష్ట పరిహారం అందుకుంటారని   తెలిపారు.
బుధవారం సాయంత్రం "  మా గల్ఫ్ డాట్ కామ్ "  ఒక ప్రయాణీకుడు మాట్లాడుతూ, , తను ,తన  భార్య మరియు ఇద్దరు పిల్లలు కల్సి  ఎమిరేట్స్ ఫ్లైట్ ఇ కె  521 దుబాయ్  విమానంలో భారతదేశం నుండి ప్రయాణిస్తున్న ౩౦౦ మంది ప్రయాణికులతో తాము ఒకరమని పేర్కొంటూ  నష్ట పరిహారం విషయం  తనకి ఇమెయిల్ ద్వారా ఎమిరేట్స్ విమాన సంస్థ ఈ వార్త వచ్చిందని తెలిపారు.మెయిల్ మంగళవారం సాయంత్రం   వచ్చిందని , కానీ నేను బుధవారం ఉదయం చూశానని తెలిపాడు ."

విమాన అధికారులు తీసుకొన్న  సత్వర చర్యను ఆయన ఈ సందర్భంగా  ప్రశంసించారు.  ఆ విమానంలో రక్షించబడిన వారందరూ అదృష్టవంతులని, కేరళాకు చెందిన ఒకరికి  6 కోట్ల లాటరి తగలడం అందరికి తెల్సిన విషయమేనని ఆయన ఉద్వేగంగా అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, ఎయిర్లైన్ బ్యాగేజ్ మరియు వ్యక్తిగత వస్తువులకు  నష్టం కోసం మాత్రమే 1,570 ఒకొక్కరికే చెల్లించడానికి సంస్థ అంగీకరించింది.  పలువురు  ప్రయాణికులు రెండు వారాలలో మొత్తం సొమ్ము  తమ ఖాతాలో జమ కాబడుతుందని ఎమిరేట్స్ సంస్థ  హామీ ఇచ్చినట్లు  వారు   "  మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు.   

శారీరకంగా...మానసికంగా  జరిగిన నష్టాల్ని ఎవరు  పూడ్చలేరు కాని ఇలా నష్టపరిహారం ద్వారా కొంత మేరకు  జీవితాన్ని నిలబెడుతున్నారు అని ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేసారు. ఎమిరేట్స్ ఫ్లైట్ ఇ కె  521 దుబాయ్  ( డి ఎక్స్ బి ) ప్రయాణికులు నిజంగా భగవంతుని దయవలన ప్రాణాలతో రక్షింపబడిన అదృష్టవంతులని, ఆరోజు వారు క్షేమంగా బయటపడటం అన్నది నిజంగా  ఒక అద్భుతం అని  ప్రత్యక్ష సాక్షుల అభిప్రాయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com