యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- July 08, 2026
హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేవస్థానం పరిపాలనపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు.
ఇటీవల ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులతో జరిగిన ఈ సమావేశంలో దేవస్థానం భవిష్యత్ కార్యాచరణ, అభివృద్ధి ప్రణాళికలు, పారదర్శక పాలన, భక్తులకు నాణ్యమైన సేవలు అందించే అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.
సమావేశంలో దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డి, బోర్డు సభ్యులు వినోద్ వెంకటస్వామి (ఎమ్మెల్యే), కొణిదెల సురేఖ, విజయరాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డా. మల్లయ్య, స్వాతి కాంతమనేని, ఎం. రాఘవేందర్ రావు, డా. లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు భక్తులకు అన్ని విధాలుగా మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పాలక మండలికి సూచించారు. ఆలయ ప్రతిష్ఠకు అనుగుణంగా పరిపాలనలో పారదర్శకత, సేవాభావం, సమర్థవంతమైన నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
యాదగిరిగుట్టను దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడంలో పాలక మండలి సమిష్టిగా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







