శ్రీవారి భక్తులకు అలర్ట్..
- July 09, 2026
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అలర్ట్ జారీ చేసింది. రాబోయే జులై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య తిరుమలలో జరిగే వివిధ పండుగలు, విశేష ఉత్సవాల నేపథ్యంలో.. పలు ప్రత్యేక తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల సాధారణ భక్తులకు దర్శన సమయం కలిసిరానుంది. ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రముఖులకు మినహా, మిగిలిన ఎవరి సిఫార్సు లేఖలనూ ఆయా తేదీలకు ముందురోజు స్వీకరించబోమని బోర్డు స్పష్టం చేసింది. భక్తులు ఈ మార్పులను గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దయిన తేదీలు–కారణాలు:
- జులై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- జులై 17: ఆణివార ఆస్థానం
- జులై 19: శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద
- జులై 29: జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
- ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ
- ఆగస్టు 24: పవిత్రోత్సవాల రెండోరోజు (పవిత్రాల సమర్పణ)
- సెప్టెంబర్ 8: శ్రీవారి బ్రహ్మోత్సవాల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- సెప్టెంబర్ 14: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- సెప్టెంబర్ 15 నుండి 23 వరకు: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
ఈ 9 రోజులు బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు అయ్యాయి. కాబట్టి, తిరుమల భక్తులు ఈ తేదీలను చూసుకొని వారివారి ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాల్సిందిగా టీటీడీ (TTD) సూచించింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







