అలయన్స్ ఎయిర్ అదనపు సర్వీసులు
- August 12, 2016
ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన అలయన్స్ ఎయిర్... హైదరాబాద్-విజయవాడ మధ్య ఆగస్టు 16, 18న అదనపు సర్వీసులు నడుపుతోంది. ఈ విమానం హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2.50కి బయలుదేరి 3.50కి చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 4.20కి బయలుదేరి హైదరాబాద్‌కు 5.20కి వస్తుంది. హైదరాబాద్-విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ-హైదరాబాద్ మధ్య వారానికి అయిదు అలయన్స్ ఎయిర్ సర్వీసులు నడుస్తున్నాయి.15 ఆగస్టు నుంచి శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో సర్వీసులుంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం 8.30కి బయల్దేరే విమానం విజయవాడలో 9.30కి దిగుతుంది. 10 గంటలకు బయల్దేరి విశాఖపట్నంలో 11.10కి అడుగుపెడుతుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 11.40కి ప్రారంభమై విజయవాడ కు 12.50కి చేరుతుంది. మధ్యాహ్నం 1.20కి మొదలై 2.20కి హైదరాబాద్ వస్తుంది.
తాజా వార్తలు
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!









