'జనతా గ్యారేజ్‌' ఆడియో రిలీజ్ ఫంక్షన్

- August 12, 2016 , by Maagulf
'జనతా గ్యారేజ్‌' ఆడియో రిలీజ్ ఫంక్షన్

జనతాగ్యారేజ్‌తో తన గమ్యానికి మరింత దగ్గరయ్యాయనని ఎన్టీఆర్ స్పష్టంచేశాడు. పుష్కరకాలం తర్వాత ఇవ్వబోయే భారీ హిట్‌.. తనకు అత్యంత ఆప్తుడైన శివ ఇస్తాడేమో అనిపిస్తుందని మనసులోని మాట బయటపెట్టాడు ఎన్టీఆర్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో శుక్రవారం 'జనతా గ్యారేజ్‌' ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి మాట్లాడిన ఎన్టీఆర్‌.. 'టెంపర్‌'తో చిన్న వెలుగు చూశానని, ఆ తర్వాత 'నాన్నకు ప్రేమతో' ఇంకా దగ్గరయ్యాను.. ఇప్పుడు 'జనతా గ్యారేజ్‌'తో తన గమ్యానికి మరింత దగ్గరయ్యానని యంగ్‌ టైగర్‌ అన్నాడు.ఎప్పటికప్పుడు అభిమానులు రుణం తీర్చుకోవాలనుకుంటానని, కానీ ఈ జన్మలో అది జరగదేమో అనిపిస్తుందని వ్యక్తంచేశాడు. మహానటుడు ఎన్టీఆర్ మనవడిగా పుట్టడం ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమని, ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నాను. ఫస్ట్ మూవీ చేసినప్పుడు తానేమిటో తనకు అర్ధంకాలేదని, 'ఆది', 'సింహాద్రి' హిట్స్‌తో సక్సెస్‌ అంటే ఇంతేనేమో అనుకున్నానని, వరసగా సినిమాలు చేస్తున్నా కానీ ఫ్యాన్స్‌ని ఆనందపరచలేక పోయానని గుర్తు చేశాడు. అద్భుతమైన నటుడు మోహనలాల్‌తో కలిసి స్ర్కీన్ షేర్‌ చేసుకునే అవకాశం తనకు దక్కిందని, శివకు తప్పకుండా హ్యాట్రిక్‌ హిట్‌ అవుతుందన్న ఒపీనియన్‌ని వ్యక్తంచేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com