అబూధాబీ రెండు గిడ్డంగుల్లో తప్పిన భారీ అగ్ని ప్రమాదం
- August 12, 2016
అబూ ధాబీ : శుక్రవారం అబూధాబీ నగరం లోని అల్ మినా ప్రాంతంలోని రెండు గిడ్డంగులకు నిప్పంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఎటువంటి మరణాలు లేదా గాయాలు కాలేదని నివేదించారు. పోలీసుల సమన్వయంతో అబూధాబీ సివిల్ డిఫెన్స్ జట్లు మంటలను అదుపు చేసేందుకు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఒక గిడ్డంగిలో స్టేషనరీ అంశాలు ఉండగా మరో గిడ్డింగిలో ఆహార ఉత్పత్తులు నిల్వ ఉన్నట్లు అబూధాబీ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అబ్దుల్ జలీల్ అల్ అన్సారీ తెలిపారు. తాము ఉదయం 11.15 గంటలకు ఈ అగ్నిప్రమాదం గూర్చి ఫోన్ ద్వారా సమాచారం అందుకున్నట్లు ఆయన చెప్పారు. అగ్నిప్రమాదంకు కారణాలని పరిశోధనల అనంతరం వివరిస్తామని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత









