ఇరాన్‌పై సైనిక చర్యలో పాల్గొనే ఉద్దేశం లేదు.. ఖతార్..!!
- July 17, 2026
దోహా: ఇరాన్‌పై సైనిక చర్యలో పాల్గొనడానికి ఖతార్ అంగీకరించిందంటూ ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలను ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుత ఘర్షణలో ఖతార్‌ను బలవంతంగా భాగస్వామిగా చూపించడం, మధ్యవర్తిత్వంలో దేశం పోషిస్తున్న కీలక పాత్రను దెబ్బతీయడం, ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు, అశాంతి సృష్టించడమే ఈ తప్పుడు ప్రచారాల ఉద్దేశమని పేర్కొంది.
తమ పొరుగు దేశాలపై ఎలాంటి సైనిక చర్యలోనూ ఖతార్ పాల్గొనలేదని, భవిష్యత్తులో కూడా పాల్గొనబోదని ఖతార్ అంతర్జాతీయ మీడియా కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణలు తమ దౌత్యపరమైన శాంతి ప్రయత్నాలను ప్రభావితం చేయలేవని ఖతార్ తెలిపింది. ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి అన్ని పక్షాల ఆందోళనలకు పరిష్కారం చూపే సమగ్ర, శాశ్వత ఒప్పందం కుదిరే వరకు మధ్యవర్తిత్వ ప్రయత్నాలను కొనసాగిస్తామని వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్‌లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవల్లో మార్పులు..







