అథ్లెట్ల గురించి మాట్లాడండి - సచిన్

- August 13, 2016 , by Maagulf
అథ్లెట్ల గురించి మాట్లాడండి - సచిన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ కోరిక కోరారు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రధాని ప్రసంగంలో భాగంగా రియో అథ్లెట్ల గురించి ప్రస్తావించండని వేడుకున్నారు సచిన్. ప్రధాని మోదీ తన ప్రసంగం కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భం గా రియో అథ్లెట్లకు స్ఫూర్తి కలిగించేలా ప్రసంగం చేయాలని మోడీని కోరారు సచిన్.
దీనిపై ప్రధాని మోదీ 'నమో' యాప్‌ లో ఓ లేఖ రాసారు సచిన్. గెలుపోటములను పక్కనబెడితే.. ఎన్నో కష్టాలను సవాళ్ళను ఎదురుకొని దేశం కోసం ఆడుతున్నారని, ప్రస్తుతం వారికి ప్రోత్సాహం ఎంతో అవసరమని.. అందుకే స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో రియో అథ్లెట్ల గురించి మాట్లాడాలని , ప్రధాని స్థానంలో మీరు చెప్పే మాటలు.. వారికి ఎంతగానో స్ఫూర్తినిస్తాయన్నా విన్నవించుకున్నారు లిటిల్ మాస్టర్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com