ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!

- July 20, 2026 , by Maagulf
ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!

దోహా: ఖతార్ ప్రభుత్వం డ్రోన్ల వినియోగాన్ని నియంత్రించేందుకు 2026 నాటి చట్టం నం.10ను అమల్లోకి తీసుకొచ్చింది. డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి నిర్వహణకు స్పష్టమైన చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు దేశ గగనతల భద్రతను కాపాడడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (QCAA) స్పష్టం చేసింది.  

QCAA తన సోషల్ మీడియా అకౌంట్లో పేర్కొన్న కొత్త చట్టం ప్రకారం.. డ్రోన్ల లైసెన్సులు, ఆపరేషన్ అనుమతులు జారీ చేయడం, పునరుద్ధరించడం, డ్రోన్ల రకాలను నిర్ణయించడం, అనుమతించే ఎగిరే ప్రాంతాలు, గరిష్ట ఎత్తులను నిర్ధారించడం, దిగుమతి-ఎగుమతులను నియంత్రించడం వంటి బాధ్యతలను QCAA నిర్వహిస్తుంది.

చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారికి ముందుగా హెచ్చరిక జారీ చేసి, అవసరమైతే లైసెన్స్‌ను గరిష్టంగా మూడు నెలల పాటు సస్పెండ్ చేయడం లేదా సంబంధిత సంస్థలను 15 రోజుల వరకు మూసివేయడం వంటి పరిపాలనా చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంటుంది.

అలాగే, చట్టంలోని కీలక నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష, QR 3 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. నేరానికి ఉపయోగించిన డ్రోన్‌తో పాటు సంబంధిత పరికరాలను కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. 

ఇతర నిబంధనల ఉల్లంఘనలకు QR 2 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. డ్రోన్ వల్ల ఇతరులకు లేదా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం జరిగితే యజమాని, ఆపరేటర్, పైలట్ తదితరులు సంయుక్తంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని కొత్త చట్టం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com