బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- July 20, 2026
బ్రిటన్ నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంతకాలం ప్రధానిగా కొనసాగిన కీర్ స్టార్మర్ సోమవారం అధికారికంగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రిన్స్ కింగ్ ఛార్లెస్ 3కి తన రాజీనామా సమర్పించారు. అనంతరం 10 డౌన్‌స్ట్రీట్‌లో తన చివరి ప్రసంగం చేశారు. తాను ప్రధాని పదవి నుంచి సంతోషంగా వైదొలుగుతున్నట్లు స్టార్మర్ చెప్పారు. తన తర్వాత ఆండీ బర్న్‌హామ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఆండీకి మద్దతు ఇవ్వాలని తన సన్నిహితులను, బ్రిటన్ ప్రజలను స్టార్మర్ కోరారు. దీంతో ఆండీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా కింగ్ ఛార్లెస్-3 సోమవారం ఆండీ బర్న్‌హామ్‌ను ఆహ్వానించారు. ఆండీ ఈ వారమే ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. అనంతరం ఆయన తన మంత్రివర్గాన్ని నియమించుకుని, పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ బాధ్యతలు స్వీకరిస్తారు. లేబర్ పార్టీ తరఫున స్టార్మర్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో ప్రధానిగా ఆండీని ఆ పార్టీ నియమించింది. ఎలాంటి ఓటింగ్ లేకుడానే ఆయనను ప్రధానిగా ఎన్నుకున్నారు.
ప్రజలకు జీవన వ్యయాన్ని తగ్గించమే లక్ష్యం
ఆండీ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తే.. పదేళ్లలో బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన ఏడో వ్యక్తిగా నిలుస్తారు. ఇలా బ్రిటన్‌లో పదేళ్లలో ఏడుగురు ప్రధానులు మారడం అరుదైన విషయం. 56 ఏళ్ల ఆండీ.. ప్రస్తుతం గ్రేటర్ మాంచెస్టర్ మేయర్‌గా ఉన్నారు. ఆయనను కింగ్ ఆఫ్ ద నార్త్ అని పిలుస్తారు. లేబర్ పార్టీలో స్టార్మర్‌కు ధీటైన నేతగా ఆండీకి పేరుంది. అయితే, ఆయనకు అక్కడి ప్రజలకు అంతగా పరిచయం లేదు. ముఖ్యంగా తన మేయర్ పరిధి దాటి తెలిసేది చాలా తక్కువ. బాధ్యతాయుతమై, స్థిరమైన రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని ఆండీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలపై ద్రుష్టి సారిస్తారని, ముఖ్యంగా బ్రిటన్ ప్రజలకు జీవన వ్యయాన్ని తగ్గించమే లక్ష్యమని ఆండీ కార్యాలయం తెలిపింది. మొదటి 100 రోజుల్లో ఆయన ఎలాంటి పాలన అందిస్తారు అనే దానిపై ఆండీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఇక, ఆండీ భారత్ విషయంలో సానుకూలంగా ఉంటారనే ప్రచారం ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







